: ఏపీకి కొత్త రైల్వే జోన్లు కోరిన జగన్


వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ నేడు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుతో భేటీ అయ్యారు. ఏపీకి కొత్త రైల్వే జోన్లు కేటాయించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కూడా జగన్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ వినతులకు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని జగన్ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన కోసం జగన్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన వెంట ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News