: మ్యాచ్ సందర్భంగా సిడ్నీలో కొట్టుకున్న ఇండియా, పాక్ అభిమానులు


ప్రపంచకప్ ఫైనల్ ఎలా ఉండబోతోందో ఇప్పటికిప్పుడు మనం ఊహించలేం కానీ... దాని కంటే కూడా ఎక్కువ ఉత్కంఠ రేపింది నిన్న జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా అభిమానులు ఈ మ్యాచ్ ను తిలకించారంటే... మ్యాచ్ లో ఎంత వోల్టేజ్ ఉందో అర్థమవుతుంది. ఈ క్రమంలో, సిడ్నీలోని మేరీలాండ్ క్లబ్ లో దాదాపు 180 మంది ఈ మ్యాచ్ ను టీవీలో తిలకించారు. ఈ సందర్భంగా భారత్-పాక్ అభిమానుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. దాదాపు 40 మంది బాహాబాహీకి తలపడ్డారట. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో ఇంతవరకు ఎలాంటి అరెస్టులు జరగకపోయినప్పటికీ... నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News