: ఉప ఎన్నికల్లో ఊరట... లిరోమొబా స్థానంలో గెలిచిన కాంగ్రెస్


అరుణాచల్ ప్రదేశ్‌ లోని లిరోమొబా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి న్యామర్ కార్బాక్ తన సమీప భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థిపై 119 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎన్నికల అధికారి డీజే భట్టాచార్య తెలియజేసిన వివరాల ప్రకారం, కర్బాక్‌కు 3,808 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బైగాడీకి 3,689 ఓట్లు వచ్చాయి. మరో తొమ్మిది మంది ఓటర్లు నోటా (నన్ అఫ్ ది అబవ్) బటన్ నొక్కారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది.

  • Loading...

More Telugu News