: ‘గ్రీటింగ్ పాలిటిక్స్’కు మేం వ్యతిరేకం... ఢిల్లీలో అభినందన పోస్టర్లపై కేజ్రీవాల్ అసంతృప్తి


ఏడాది వ్యవధిలో రెండు సార్లు ఢిల్లీ ఫీఠాన్ని అధిష్టించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తన విజయంపై నగరవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సంబరాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘విజయం సాధించిన మమ్మల్ని అభినందిస్తూ పలువురు నగరవ్యాప్తంగా పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఇది సరైన పధ్ధతి కాదు. ఈ తరహా గ్రీటింగ్స్ పాలిటిక్స్ కు మేం వ్యతిరేకం. గెలుపు సంబరాలు చేసుకోవాలనుకునే వలంటీర్లు ప్రజా సేవలో నిమగ్నం కండి’’ అంటూ ఆయన ఫేస్ బుక్ లో పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ పెట్టిన ఈ పోస్టింగ్ ను కేవలం గంట వ్యవధిలో 14,000 మంది లైక్ చేయడంతో పాటు ఇతరులకు షేర్ చేశారు.

  • Loading...

More Telugu News