: హైకోర్టులో విచారణ ముగిసింది... ఇక సుప్రీంకోర్టుకు వెళ్తా: నాగం


హైదరాబాద్ నడిబొడ్డున ఎర్రగడ్డలో ఉన్న చెస్ట్ ఆసుపత్రిని తరలించరాదంటూ బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. చెస్ట్ ఆసుపత్రిని తరలించడం రాజ్యాంగ వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన కోర్టు... అంటువ్యాధుల ఆసుపత్రి నగర శివార్లలో ఉండటమే మంచిదని కూడా సూచించింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని చెప్పింది. దీనిపై నాగం జనార్దన్ రెడ్డి స్పందించారు. చెస్ట్ ఆసుపత్రిని తరలిస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ఈ అంశంపై హైకోర్టులో విచారణ ముగిసినందున, సుప్రీంకోర్టుకు వెళతానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News