: లిబియాపై ఈజిప్టు వైమానిక దాడులు... ఐఎస్ లక్ష్యంగానే ప్రతీకార దాడులు


ఈజిప్టు కొద్దిసేపటి క్రితం లిబియాపై వైమానిక దాడులను ప్రారంభించింది. లిబియాలోని ఐఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈజిప్టు ఈ దాడులకు దిగింది. తమ దేశానికి చెందిన 21 మందిని ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల ఊచకోత కోశారు. ఈ దారుణానికి సంబంధించిన అత్యంత భయానకమైన వీడియోలను ఐఎస్ ఉగ్రవాదులు విడుదల చేశారు. తమ దేశ పౌరులపై ఐఎస్ ఉగ్రవాదులు సాగించిన దారుణ మారణకాండను ఈజిప్టు తీవ్రంగా పరిగణించింది. వెనువెంటనే వైమానిక దాడులను ప్రారంభించింది. ఈ దాడుల్లో ఐఎస్ ఉగ్రవాదులకు జరిగిన నష్టం వివరాలు వెల్లడి కాలేదు.

  • Loading...

More Telugu News