: రక్షణ మంత్రి ఇలాకాలో వరుసగా ఆరోసారి బీజేపీ జయకేతనం... భారీగా తగ్గిన మెజారిటీ


గోవాలోని పనాజీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ వరుసగా ఆరోసారి విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి సిద్ధార్థ్ కున్కోలియెంకర్, కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర ఫుర్తాడోపై 5,368 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొన్నటిదాకా గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ స్థానం నుంచే గోవా అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు. 1994 నుంచి ఐదుసార్లు పారికర్ అక్కడ విజయం సాధించారు. తాజాగా సీఎం పదవితో పాటు పనాజీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన పారికర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పారికర్ రాజీనామాతో ఈ స్థానానికి ఇటీవల ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా, మెజారిటీ మాత్రం భారీగా తగ్గింది.

  • Loading...

More Telugu News