: సమాన ప్రాతినిధ్యం కావాలి కదా? హోం లోన్ ఈఎంఐ నువ్వూ సగం కట్టు!: గృహిణికి ముంబై కోర్టు ఆదేశం


'ప్రస్తుతం మహిళలకు కూడా సమాన ప్రాతినిధ్యం కావాలంటున్నారు. అందువల్ల ఇంటి రుణంపై ఈఎంఐ భార్యాభర్తలు ఇద్దరూ కలసి చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు' అని ముంబై ఫ్యామిలీ కోర్టు తీర్పిచ్చింది. ఇంటి కోసం ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తాన్ని తన భర్తే చెల్లించాలని ఓ ఉద్యోగిని వేసిన పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. తన ఇంటి ఖర్చులకు నెలకు రూ.90 వేలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేయగా, దాన్ని కూడా తోసిపుచ్చింది. కుటుంబంలోని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి డబ్బులు చెల్లిస్తే, ఒక్కరిపైనే భారం పడదని తెలిపింది. కాగా, కోర్టును ఆశ్రయించిన మహిళ తన భర్తతో కలిసే ఉండటం గమనార్హం.

  • Loading...

More Telugu News