: యువీకి భారీ రేటు... రూ.16 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్


ఐపీఎల్-8 వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. మెరుగైన ట్రాక్ రికార్డులున్న క్రికెటర్లకు ఎంత ధరనైనా చెల్లించేందుకు ఆయా జట్ల ఫ్రాంచైజీలు ఏమాత్రం వెనుకాడటం లేదు. వరల్డ్ కప్ బరిలోకి దిగిన టీమిండియాలో చోటు దక్కని భారత సంచలన బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ కు ఐపీఎల్-8 వేలంలో భారీ ధర పలికింది. రూ. 16 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు యువరాజ్ ను కొనుగోలు చేసింది. బెంగళూరులో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన వేలంలో యువరాజ్ ను దక్కించుకునేందుకు ఆయా జట్ల యాజమాన్యాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఎట్టకేలకు ఢిల్లీ జట్టు యువరాజ్ ను రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో ఇప్పటిదాకా అత్యధిక రేటు పలికిన క్రీడాకారుడు యువరాజ్ సింగే. ఈ వేలంలో ఇదే అత్యధిక ధరగా నిలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News