: షూటింగ్ యూనిట్ తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐ... ఎస్పీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
ఖమ్మం జిల్లా పాల్వంచలో షూటింగ్ జరుపుకుంటున్న 'ఆంధ్రాపోరి' చిత్ర యూనిట్ బృందంతో ఎస్ఐ షణ్ముగాచారి అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గత 20 రోజులుగా షూటింగ్ సాగుతుండగా, భద్రాచలం రోడ్ లోని బృందావన్ రెస్టారెంట్ లో చిత్ర యూనిట్ బస చేసింది. ఇటీవల రాత్రివేళ ఎస్ఐ ఆ రెస్టారెంట్ కు వెళ్లి చిత్ర బృందంతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, పూరి జగన్నాథ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని విధులనుంచి తప్పించి, ఎస్పీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.