: టీమిండియా జెర్సీతో టెన్సిస్ దిగ్గజం ఫెదరర్... దాయాదుల పోరులో భారత్ కు మద్దతు
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ అంటే, విశ్వవ్యాప్తంగా ఆసక్తే. ఒక్క క్రికెట్ అభిమానులే కాక ఇతర క్రీడాకారులు, అభిమానులు కూడా టీవీ తెరలకు అతుక్కుపోతారు. ఇక వరల్డ్ కప్ వేదికగా జరిగే భారత్, పాక్ మ్యాచ్ అంటే, ఎక్కడ లేని హై ఓల్టేజీ. అందుకు నిదర్శనంగా టెన్నిస్ లో రారాజుగా వెలుగొందుతున్న రోజర్ ఫెదరర్ కూడా ఈ మ్యాచ్ పట్ల ఆసక్తి కనబరిచాడు. మ్యాచ్ లో తన మద్దతును టీమిండియాకు ప్రకటించిన అతడు, బ్లూ జెర్సీని ప్రదర్శించాడు. అతడి అంచనాల మేరకు టీమిండియా కూడా పాక్ పై చిరస్మరణీయ విజయాన్ని సాధించింది.