: పరువు తీస్తున్నారు... అధికారులపై కేటీఆర్ నిప్పులు!
‘రోడ్లను అద్దంలా తయారు చేయాలని సీఎం కేసీఆర్ చెబుతుంటే, ఆయన సొంత జిల్లాలోనే ఒక్క రోడ్డు కూడా ప్రారంభించరా? ఏం చేస్తున్నారు? ఇతర జిల్లాల్లో పనులు పూర్తి కావచ్చాయి. సీఎం జిల్లా పరువు తీస్తున్నారు’ అంటూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పీఆర్, ఆర్ అండ్‌బీ అధికారులపై నిప్పులు చెరిగారు. పద్ధతి మార్చుకొని, రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆయన హెచ్చరించారు. జిల్లాకు మంజూరైన పనులు ప్రారంభం కాకపోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావడంతో రూ.1,769 కోట్లతో రోడ్లు మంజూరు చేశామన్నారు.