: అతడిని ఆడించడంతోనే ఓటమి... ఆటతీరు ఇంత దారుణమా?: పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్


చాలా కాలం తర్వాత తాను క్రికెట్ మ్యాచ్ చూశానని, అయితే పాకిస్థాన్ ఆటతీరు ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదని పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ విమర్శించాడు. ప్రపంచకప్ లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి చవిచూడడాన్ని ఆయన విశ్లేషించాడు. ముఖ్యంగా వికెట్ కీపర్ ఉమర్ అక్మల్, విరాట్ కోహ్లి ఇచ్చిన క్యాచ్ వదిలేయడాన్ని ఆయన తప్పుబట్టాడు. అతడిని ఆడించడం పొరపాటని, అందుకే తమ జట్టు తగిన మూల్యం చెల్లించుకుందని వ్యాఖ్యానించాడు. కెప్టెన్ మిస్బాపై ప్రశంసలు కురిపించిన ఇమ్రాన్, ఈ వరల్డ్ కప్ లో ఇంకా చాలా మ్యాచ్ లు ఆడాల్సివున్నందున పాఠాలు నేర్చుకోవాలని పాక్ బ్యాట్స్ మెన్ కు సూచించాడు.

  • Loading...

More Telugu News