: బందరు రోడ్డులో సమాధుల పెకలింపు... బెజవాడ కబ్జాకోరుల దుశ్చర్యపై ఎమ్మార్పీఎస్ ఆందోళన
నవ్యాంధ్ర రాజధానికి అతి సమీపంలోని విజయవాడలో కబ్జాకోరుల బరితెగింపు నానాటికీ పెరిగిపోతోంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు కబ్జాకోరులు నగరంలోని బందరు రోడ్డులోని శ్మశానాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి ప్రొక్లెయిన్లతో వచ్చిన కబ్జాకోరులు శ్మశానంలోని సమాధులను తవ్వేశారు. అక్కడి చారిత్రక ఆనవాళ్లను కూడా ధ్వంసం చేశారు. నేటి ఉదయం కబ్జాకోరుల దుశ్చర్యను గమనించిన స్థానికులు రెవెన్యూ, పోలీసు శాఖలకు ఫిర్యాదు చేశారు. కబ్జాకోరుల దుశ్చర్యకు నిరసనగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రెవెన్యూ యంత్రాంగం, ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది.