: సుప్రీంకోర్టు జడ్జీ ఎన్వీ రమణ ఇంట్లో పెళ్లి సందడి... కూతురి వివాహ రిసెప్షన్ కు మోదీ, చంద్రబాబు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి, తెలుగు నేలకు చెందిన న్యాయ కోవిదుడు జస్టిస్ ఎన్వీ రమణ ఇంట్లో నిన్న పెళ్లి సందడి నెలకొంది. ఇటీవల హైదరాబాదులో జస్టిస్ రమణ కూతురు వివాహం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సదరు వివాహ రిసెప్షన్ ను నిన్న ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అతిరథ మహారథులంతా క్యూ కట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్ర కేబినెట్ మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సదానంద గౌడ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, కాంగ్రెస్ నేతలు కేవీపీ, రాయపాటి, లగడపాటి తదితర ప్రముఖులంతా హాజరయ్యారు.