: పాక్ పై కోహ్లీ సెంచరీకి ధోని రెచ్చగొట్టడమే కారణమా?: వాట్సప్ లో హల్ చల్ చేస్తున్న జోక్!
ప్రపంచకప్ లో భాగంగా నిన్నటి దాయాదుల సమరంలో పాక్ ను భారత్ చిత్తు చేయడంలో టీమిండియా వైఎస్ కెప్టెన్ కోహ్లీదే కీలక భూమిక. సెంచరీతో చెలరేగిన కోహ్లీ, భారత విజయాన్ని దాదాపుగా ఖరారు చేశాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ లోనూ చురుకైన కదలికతో పాక్ కీలక వికెట్ షాహిద్ అఫ్రీదీని పెవిలియన్ చేర్చాడు. ఇదిలా ఉంటే, బ్యాటింగులో కోహ్లీ చెలరేగిపోవడానికి ఓ కారణముందంటూ వాట్సప్ లో ఓ జోక్ హల్ చల్ చేస్తోంది. ఆ జోక్ సారాంశమేంటంటే... భారత్ తొలి వికెట్ కోల్పోగానే బ్యాటింగుకు వెళుతున్న కోహ్లీని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆపాడట. ‘‘కోహ్లీ... బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పీకే మూవీలో నీ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను ప్రేమించింది పాకిస్థానియే’’ అంటూ రెచ్చగొట్టాడట. దీంతో కోహ్లీ అమాంతం రెచ్చిపోయాడట!