: తిరుపతి కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత: తహశీల్దార్ ను దూషించిన డీఎస్పీ.. రెవెన్యూ సిబ్బంది ధర్నా


తిరుపతి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. నగరంలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం వద్ద రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కౌంటింగ్ ఏర్పాట్లలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న ఓ తహశీల్దార్ ను డీఎస్పీ దూషించారు. దీంతో సదరు డీఎస్పీతో రెవెన్యూ శాఖ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. దీనిని గమనించిన అక్కడి పోలీసులు డీఎస్పీకి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇరు శాఖలకు చెందిన అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దురుసుగా ప్రవర్తిస్తున్న పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది వైఖరికి నిరసనగా రెవెన్యూ శాఖ సిబ్బంది అక్కడికక్కడే ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News