: అతడి కంటే ఘనులు ఆ తండ్రీకొడుకులు: బాబు


అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ లతో పోల్చితే గజనీ మహ్మద్ ఏపాటి అని చంద్రబాబు వ్యంగ్యోక్తి విసిరారు. గజనీ కేవలం బంగారం, సంపదతోనే సరిపెట్టుకున్నాడని.. వీళ్ళిద్దరూ మాత్రం భూములను, గనులను కూడా వదల్లేదని బాబు విమర్శించారు. ప్రస్తుతం బాబు విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ మన్యం ప్రాంతంలో ఉన్న వేల కోట్ల రూపాయల విలువ చేసే బాక్సైట్ గనులను అనుయాయులకు ధారాదత్తం చేశాడని ఆరోపించారు. అంతేగాకుండా సన్నిహితుడు పెన్నా ప్రతాప రెడ్డి పరిశ్రమ పెట్టుకునే క్రమంలో నిరుపేద భూములను బలవంతంగా లాగేసుకున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే భూములు కోల్పోయిన పేదలను ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News