: ఆ రికార్డు కోహ్లీ సొంతం!


ఐసీసీ వరల్డ్ కప్ లో ఆదివారం పాకిస్థాన్ జట్టుతో జరిగిన ప్రతిష్ఠాత్మక మ్యాచ్ లో టీమిండియా అపురూపమైన విజయం నమోదు చేసుకోవడం తెలిసిందే. అద్భుత సెంచరీతో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (107) భారత్ విక్టరీలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. పాకిస్థాన్ జట్టుపై వరల్డ్ కప్ లో సెంచరీ సాధించిన ఏకైక భారత క్రికెటర్ కోహ్లీనే. ఇప్పటిదాకా, పాక్ పై వరల్డ్ కప్ లో మనవాళ్ల వ్యక్తిగత స్కోరు రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 2003 వరల్డ్ కప్ లో బ్యాటింగ్ దేవుడు సచిన్ పాక్ పై 98 పరుగులు చేశాడు. తాజాగా, ఆ రికార్డును తన అమోఘమైన బ్యాటింగ్ ప్రదర్శనతో కోహ్లీ అధిగమించడం విశేషం. వన్డే కెరీర్లో ఈ ఢిల్లీ డైనమైట్ కు ఇది 22వ సెంచరీ.

  • Loading...

More Telugu News