: పాకిస్థాన్ లో టీవీలు ధ్వంసం చేసిన క్రికెట్ అభిమానులు
వరల్డ్ కప్ చరిత్రలో మరోసారి భారత్ చేతిలో తమ జట్టు పరాజయం పాలవడాన్ని పాకిస్థాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలు చోట్ల టెలివిజన్ సెట్లను ధ్వంసం చేశారు. వీధుల్లోకి వచ్చి పాక్ క్రికెటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, చిరకాల ప్రత్యర్థి పాక్ పై టీమిండియా ఘనవిజయం సాధించడంతో, భారత్ లో సంబరాలు అంబరాన్నంటాయి. ఫ్యాన్స్ వీధుల్లోకొచ్చి బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల మిఠాయిలు పంచారు. విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం ధోనీ సేన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.