: ఈ మ్యాచ్ కోసం ఎంత కష్టపడ్డామో: కోహ్లీ


టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పాకిస్థాన్ పై ఘనవిజయాన్ని తన కెరీర్లో అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. తాజా వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం అద్భుతరీతిలో ఆరంభమైందని అన్నాడు. ఈ ప్రతిష్ఠాత్మక పోరులో పాక్ ఆటగాళ్లు కూడా పోరాడారని ప్రశంసించాడు. తానెప్పుడూ అంచనాలను అందుకునేందుకు ప్రయత్నిస్తానని, ఓటమిని అసహ్యించుకుంటానని తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం గత రెండ్రోజులుగా ఎంతో శ్రమించామని, హోటల్లో సహాయక సిబ్బంది వ్యూహ రచన సందర్భంగా ఎంతో కష్టించారని చెప్పాడు. ధావన్, రైనా సమయోచితంగా రాణించారని అభినందించాడీ ఢిల్లీ డైనమైట్. అడిలైడ్ లో నేడు పాక్ తో జరిగిన మ్యాచ్ లో 107 పరుగులు చేసిన కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News