: నాలో ఎమోషన్లుంటాయి... అయితే, బయటికి కనిపించవు: ధోనీ


చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ ధోనీ మాట్లాడాడు. భావోద్వేగాలను ఎలా అదుపు చేసుకుంటారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... తనలోనూ ఎమోషన్లుంటాయని, అవెక్కడికీ పోవని, అయితే, తనలోని భావోద్వేగాలను అతిగా ప్రదర్శించడాన్ని ఇష్టపడనని తెలిపాడు. ఇక, పాక్ తో ప్రతిష్ఠాత్మక మ్యాచ్ గురించి చెబుతూ, జట్టుగా మంచి ప్రదర్శన కనబరిచామని పేర్కొన్నాడు. బ్యాటింగ్ విభాగం రాణించడం సంతోషదాయకమన్నాడు. కోహ్లీ-ధావన్, కోహ్లీ-రైనా మధ్య నడిచిన భాగస్వామ్యాలు భారీ స్కోరుకు ఉపకరించాయని అన్నాడు. అభిమానులు సైతం తమ విజయానికి తోడ్పడ్డారని తెలిపాడు.

  • Loading...

More Telugu News