: దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది: టీమిండియా ఆటగాళ్లకు మోదీ అభినందన
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై వరల్డ్ కప్ లో నెగ్గిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందంటూ భారత క్రికెటర్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అద్భుత విజయం సాధించారని, గర్వంగా ఉందని ట్వీట్ చేశారు. అడిలైడ్ లో దాయాదుల మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో భారత్ 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ విజయం సాధించడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా అభినందనలు తెలిపారు.