: చరిత్ర మార్చేస్తామని చెప్పి చేతులెత్తేశారు... పాక్ పై భారత్ ఘనవిజయం
వరల్డ్ కప్ చరిత్రలో భారత్ పై ఎన్నడూ నెగ్గని పాకిస్థాన్ జట్టు అదే రికార్డును కొనసాగించింది. చరిత్ర మార్చేస్తామని, ఈసారి భారత్ కు భంగపాటు తప్పదని బీరాలు పలికిన పాక్ ఆటగాళ్లు టీమిండియా సమష్టి ప్రదర్శన ముందు తేలిపోయారు. 301 పరుగుల లక్ష్య ఛేదనలో 47 ఓవర్లలో కేవలం 224 పరుగులకే చాపచుట్టేశారు. ఆ జట్టులో కెప్టెన్ మిస్బా (76) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో షమీ 4, ఉమేశ్ యాదవ్ 2, మోహిత్ శర్మ 2 వికెట్లు తీశారు. అశ్విన్, జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు, భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 300 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (107) సెంచరీ సాధించగా, ధావన్ (73), రైనా (74) రాణించారు.