: ఉమర్ అక్మల్ డకౌట్... 103 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకున్న పాక్


పాక్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. స్టార్ బ్యాట్స్ మన్ ఉమర్ అక్మల్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఈ వికెట్ రవీంద్ర జడేజా ఖాతాలో చేరింది. జడేజా విసిరిన బంతి షార్ప్ గా టర్నయింది. బ్యాట్ ను రాసుకుంటూ వెళ్లి కీపర్ ధోనీ గ్లోవ్స్ లో వాలింది. అయితే, అంపైర్ అవుటివ్వకపోవడంతో ధోనీ నిర్ణయ సమీక్షను కోరాడు. టెలివిజన్ రీప్లేలో పరిశీలించగా, అక్మల్ అవుటేనని తేలింది. దీంతో, పాకిస్థాన్ జట్టు 103 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

  • Loading...

More Telugu News