: ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన యాదవ్... పాక్ విలవిల
టీమిండియాతో వరల్డ్ కప్ మ్యాచ్ లో పాక్ వికెట్ల పతనం ఊపందుకుంది. ఆ జట్టు నాలుగో వికెట్ చేజార్చుకుంది. పేసర్ ఉమేశ్ యాదవ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాక్ ను చావుదెబ్బ కొట్టాడు. తొలుత, ఫాంలో ఉన్న ఓపెనర్ అహ్మద్ షేజాద్ (47) ను అవుట్ చేసిన యాదవ్ అదే ఓవర్లో షోయబ్ మక్సూద్ (0) ను డకౌట్ చేశాడు. దీంతో, పాక్ 102 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు గెలవాలంటే 26 ఓవర్లలో 199 పరుగులు చేయాలి. క్రీజులో కెప్టెన్ మిస్బా (6 బ్యాటింగ్), ఉమర్ అక్మల్ (0 బ్యాటింగ్) వున్నారు.