: బ్రేకిచ్చిన అశ్విన్... రెండో వికెట్ కోల్పోయిన పాక్
పాకిస్థాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన వన్ డౌన్ బ్యాట్స్ మన్ సొహయిల్... అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో సుడులు తిరుగుతూ వచ్చిన బంతిని సరిగా అంచనా వేయడంలో విఫలమైన సొహయిల్ స్లిప్స్ లో రైనా చేతికి చిక్కాడు. ఆ ఓవర్ ను ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ మెయిడెన్ చేయడం విశేషం. అశ్విన్ బంతులను ఆడడంలో తడబడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ చివరికి అతడికే బలయ్యాడు. ప్రస్తుతం పాక్ స్కోరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 92 పరుగులు కాగా, షేజాద్ (42 బ్యాటింగ్), కెప్టెన్ మిస్బా (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 300 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.