: లేని పరుగు కోసం వెళ్లి వికెట్ సమర్పించుకున్న ధావన్


అనవసరంగా మరో వికెట్ పడింది. తొలుత రోహిత్ శర్మ చెత్త షాట్ ఆడి అవుట్ కాగా, 30వ ఓవర్ 5వ బంతికి లేని పరుగు కోసం యత్నించి ధావన్ పెవిలియన్ దారి పట్టాడు. సొహైల్ వేసిన బంతిని కోహ్లీ మిడ్ వికెట్ దిశగా ఆడగా, సింగిల్ కోసం ధావన్ ముందుకువచ్చాడు. బంతిని అందుకున్న మిస్బా గురిచూసి వికెట్ల వైపు బంతిని విసిరాడు. దీంతో, 76 బంతులు ఆడి 73 పరుగులు చేసిన ధావన్ రన్ అవుట్ అయి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ధావన్ స్థానంలో రైనా రంగంలోకి దిగాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు.

  • Loading...

More Telugu News