: సవతి తండ్రి దాష్టీకం... నిద్రలో మూత్రం పోసిందని బాలికపై మరిగే నీరు పోసి, వాతలు పెట్టిన దుర్మార్గుడు!
కన్న తండ్రిలా చూసుకోవాల్సిన వాడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. మారు కూతురిపై మరుగుతున్న వేడి నీరు పోశాడు. ఈ ఘటన తిరుపతిలోని దావనీడులో జరిగింది. నిద్రలో మూత్రం పోసిందని 9 సంవత్సరాల చిన్నారిపై ఆ వ్యక్తి వేడి నీళ్ళు పోశాడు. అంతటితో ఆగక వాతలు కూడా పెట్టాడు. బాలిక శరీరం అంతా తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. స్థానికులు నిందితుడిని పట్టుకొని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.