: చెత్త షాట్ ఆడి అవుట్ అయిన రోహిత్
భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 30 బంతులు ఆడి 15 పరుగులు చేసిన రోహిత్ సొహైల్ ఖాన్ బౌలింగ్ లో నియంత్రణ కోల్పోయి చెత్త షాట్ ఆడి పాకిస్తాన్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ దారి పట్టాడు. ఆ వెంటనే వన్ డౌన్ గా విరాట్ కోహ్లీ మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం భారత స్కోర్ 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు.