: చట్టాలు సరిలేకనే లక్షల సంఖ్యలో కేసుల పెండింగ్: మోదీ


చట్టాల్లో అస్పష్టత అధికంగా వుండటం వల్లనే న్యాయస్థానాల్లో లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్‌ లో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. చట్టాల్లో పది రకాల వ్యాఖ్యానాలు ఉండడం కూడా కేసుల పెండింగ్‌ కు మరో ప్రధాన కారణమని వివరించారు. నిపుణుల కొరత వల్లే చట్టాల్లో లోపాలను తగ్గించలేకపోతున్నామని, కీలక విధానాల తయారీకి న్యాయ నిపుణులు సహకరించాలని ఆయన కోరారు. ముసాయిదా చట్టాలను ఆన్‌ లైన్ లో ప్రవేశపెట్టి, వాటిపై న్యాయ నిపుణుల సలహాలు, అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News