: స్వయంకృతాపరాధంతోనే ఓటమి... తప్పు చేశాం: ఢిల్లీ ఎన్నికలపై వెంకయ్య సమీక్ష
తాము చేసిన స్వయంకృతాపరాధంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని చవిచూశామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు విశ్లేషించారు. లోక్ సభ ఎన్నికలు జరిగిన వెంటనే ఢిల్లీలో ఎన్నికలు పెట్టి ఉంటే ఫలితాలు బీజేపికి అనుకూలంగా ఉండేవని ఆయన అన్నారు. జాప్యం జరగడంతో నష్టం అధికంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది వ్యూహాత్మక తప్పిదమని ఆయన అన్నారు. డిల్లీలో తమ ఓట్లు నష్టపోలేదని, మిగిలిన పార్టీల ఓట్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి పడడంతోనే ఆ పార్టీ ఘన విజయం సాదించిందని వెంకయ్య నాయుడు అన్నారు.