: ఢిల్లీ బయలుదేరిన వై.ఎస్.జగన్... రాజ్ నాథ్, మోదీలతో చర్చలు!


వైకాపా అధినేత వై.ఎస్.జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తొలుత ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చర్చలు జరపనున్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని జగన్ కోరనున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేయనున్నట్టు తెలిసింది. అనంతరం జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లను కూడా కలవనున్నట్టు సమాచారం. ఆయన వెంట కొందరు వైకాపా నేతలు కూడా దేశ రాజధానికి పయనమై వెళ్లారు.

  • Loading...

More Telugu News