: మూడు రోజుల పాటు హైదరాబాదును వీడనున్న కేసీఆర్


నేటి నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ, ముంబైలో పర్యటించనున్నారు. నేడు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడి వివాహా విందులో ఆయన పాల్గొననున్నారు. రేపు రాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలు, రాయితీలు, ప్యాకేజీలపై ప్రధానితో ఆయన చర్చించనున్నారు. ఇక మంగళవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌ తో ముంబైలో కేసీఆర్ సమావేశం అవుతారు. లెండి, ప్రాణహిత-చేవెళ్ల, పెన్‌ గంగ, ఇచ్చంపల్లి ప్రాజెక్టులకు అనుమతులపై ఫడణవీస్‌ తో చర్చలు జరుపుతారని సమాచారం.

  • Loading...

More Telugu News