: నత్తనడకన ఎదురీదుతున్న సఫారీ జట్టు... 1999 నాటి షాక్ గుర్తుచేస్తున్న జింబాబ్వే


ఒక వైపు ఓవర్లు అయిపోతున్నాయి, మరోవైపు వికెట్లు రాలుతున్నాయి. అసలే నత్తనడకన సాగుతున్న దక్షిణాఫ్రికా జట్టు ఇన్నింగ్స్ లో కీలక సమయాల్లో వికెట్లు పడుతున్నాయి. జింబాబ్వే జట్టు బౌలర్లు ఇప్పటివరకూ ఎవరినీ కుదురుకోనీయలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు 23 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మిల్లర్ 14 పరుగులతో, డుమినీ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు 24 పరుగులు చేసిన ప్లెస్సిస్ ను చిగుంబురా, 25 పరుగులు చేసిన డేవిల్లియర్స్ ను ఎర్విన్ లు తమ అద్భుత బౌలింగ్ తో అవుట్ చేశారు. కాగా, గతంలో జింబాబ్వే జట్టు సఫారీ జట్టుకు రెండు సార్లు షాక్ ఇచ్చింది. రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికాపై జింబాబ్వే విజయం సాధించగా, అందులో ఒకటి 1999 ప్రపంచకప్‌ లో కావడం గమనార్హం. ఆ టోర్నీలో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన సఫారీ జట్టు 47.2 ఓవర్లలో 185 పరుగులకు కుప్పకూలింది. మరి తాజా మ్యాచ్‌లో ఏ సంచలనాలు నమోదవుతాయో చూడాలి.

  • Loading...

More Telugu News