: నాన్న , నేను కావాలనే అలా చేశాం: హీరో నాగార్జున


‘‘నాన్నగారు ఇక చాలా రోజులు బతకరని అప్పటికే మాకు తెలుసు. అందుకే, ఆయన చేతుల మీదుగా అఖిల్ ను పరిచయం చేస్తే బాగుంటుందనుకున్నాం. నాన్న గారి ఆశ కూడా అదే. అందుకే మేమిద్దరం ముందుగా అనుకుని, కావాలనే ‘మనం’ చిత్రం ద్వారా అఖిల్‌ ను పరిచయం చేశాం. నాన్నగారి ఆశీర్వాదాలు చిన్నవి కాదు.. చాలా పెద్దవి’’ అంటూ, తనయుడు అఖిల్ పరిచయ వేడుకలో అక్కినేని నాగార్జున వివరించారు. ఊహ తెలియని వయసులో చిన్నప్పుడే ‘సిసింద్రీ’లో నటించి మెప్పించిన అఖిల్ ‘మనం’లో కొన్ని సెకన్లే కనిపించినా, అందరి చూపూ తనవైపు తిప్పుకున్నాడు. హీరోగా అఖిల్ పరిచయం కానున్న చిత్రం ఆ మధ్య లాంఛనంగా ప్రారంభం కాగా, నిన్న రాత్రి అక్కినేని అభిమానుల సమక్షంలో హీరోగా అఖిల్ పరిచయ వేడుకను భారీయెత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, అమల మాట్లాడుతూ ‘‘అక్కినేని కుటుంబంలోకి నాగార్జున ఫ్యాన్‌ గా ప్రవేశించా. మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నాం. జాగ్రత్తగా చూసుకోండి. ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న హీరోయిన్ సాయేషా ఓ క్లాసిక్ బ్యూటీ’’ అని చెప్పారు.

  • Loading...

More Telugu News