: పాటపాడిన కేజ్రివాల్!
దేశ రాజధాని ఢిల్లీకి ఎనిమిదో ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్, ఆ తరువాత ఒక పాట పాడి రాష్ట్ర ప్రజలకు సందేశమిచ్చారు. 'ఇన్ సాన్ కా ఇన్ సాన్ సె హో బైచార' అనే హిందీ పాట పాడుతూ, విశ్వమానవ సోదర తత్వాన్ని, సామరస్యాన్ని అలవర్చుకోవాలని కోరారు. కాగా, తమ కార్యకర్త సీఎం కావడం గర్వకారణమని అన్నాహజారే వ్యాఖ్యానించారు. తానూ ఓట్ల లెక్కింపు రోజునే అరవింద్ కేజ్రివాల్ కు అభినందనలు తెలిపానని, సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలిపానని పేర్కొన్నారు.