: ప్రేమికుల రోజున విషాదం... ఒకే చితిపై ఇద్దరికీ అంత్యక్రియలు


రెండేళ్ల ప్రేమ తరువాత, వివాహంతో ఒకటై, తల్లిదండ్రులు కాబోయే తరుణంలో భార్య మరణాన్ని తట్టుకోలేని ఆ గుండె ఆగిపోయింది. ప్రేమికుల రోజు సాక్షిగా వారిద్దరికీ ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లా అన్నానగర్‌ లో జరిగింది. మునియప్పన్ (30), సత్య (23) రెండేళ్లు ప్రేమించుకుని గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. గర్భవతి అయిన సత్యకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నొప్పులు వచ్చాయి. మునియప్పన్ వేరే ఊరిలో ఉండడంతో, ఇరుగుపొరుగువారు స్పందించి ఆసుపత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న మునియప్పన్ ఇంటికి చేరుకుని, భార్య శవాన్ని చూసి ఏడుస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అక్కడి వారందరినీ కలచివేసింది.

  • Loading...

More Telugu News