: అక్రమ సంబంధమే బుల్లితెర నటి దీప్తి ప్రాణం తీసిందా?


నిన్న మధ్యాహ్నం హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి దీప్తి అలియాస్ రామలక్ష్మి (30) మృతి వెనుక అక్రమ సంబంధాలే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సనత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన అప్పలనాయుడు కుమార్తె బిడగం రామలక్ష్మి సినిమా రంగంలో అవకాశాలు వెతుకుతూ, 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ వచ్చింది. తన పేరును దీప్తిగా మార్చుకొని, ఆడదే ఆధారం, ఆహ్వానం, లక్కీ లక్ష్మి వంటి సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించింది. తాళి సీరియల్‌ కు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. పెళ్లమా? ప్రియురాలా?, కొత్త ఒక వింత, జోగిని సినిమాల్లో నటించింది. ఏడేళ్ల కిందట విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన పెయింటర్ శంకర్‌ తో ఆమెకు వివాహం జరుగగా, వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. తనను శంకర్ వేధిస్తున్నాడంటూ దీప్తి సనత్‌ నగర్ పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు కూడా చేసింది. సీరియల్స్ దర్శకుడు రమేష్ కుమార్‌ తో ఆమె సహజీవనం చేస్తోంది. ఈ విషయం రమేశ్ భార్యకు తెలిసి, ఆమె దీప్తితో గొడవకు దిగింది. దీప్తివైపు మొగ్గు చూపిన రమేష్, తన భార్యకు విడాకులివ్వాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే, ఆమె చనిపోయిందంటూ, రమేష్ సనత్‌ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీప్తి లాప్‌ ట్యాప్‌ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే, దీప్తిది హత్యా, ఆత్మహత్యా తేలుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News