: బీహార్లో కుల హోదాల మార్పు... మాంఝీ సంచలన నిర్ణయాలు


బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ప్రత్యేక సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో ఒక వైపు రాజకీయ సంక్షోభం వెంటాడుతున్నా, మాంఝీ మాత్రం తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో మహా దళిత్ కేటగిరీలో నుంచి తొలగించిన పాశ్వాన్ కులాన్ని తిరిగి అదే కేటగిరిలో చేర్చాలని ఆయన నిర్ణయించారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. జర్నలిస్టుల పెన్షన్ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిప్రకారం విలేకరులకు పదవీవిరమణ తర్వాత ప్రభుత్వం ప్రతినెలా 5000 రూపాయలు చెల్లించనుంది. కాగా, గతంలో మాజీ సీఎం నితీష్ కుమార్ పాశ్వాన్ కులాన్ని మహా దళిత్ కేటగిరీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News