: ఢిల్లీ కేబినెట్ భేటీ ఎల్లుండికి వాయిదా... ఒకే రోజు రెండు సార్లు వాయిదా ప్రకటన!


ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ భేటీ మరోమారు వాయిదా పడింది. నేటి ఉదయం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఆరుగురు మంత్రులతోనూ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నమే తొలి భేటీని నిర్వహించాలని కేజ్రీవాల్ తలచారు. అయితే అనుకోని కారణాల వల్ల కేబినెట్ భేటీని రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. అయితే సదరు సమావేశాన్ని ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ప్రకటించింది. కేజ్రీవాల్ అనారోగ్యం నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదా పడినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News