: డెక్కన్ క్రానికల్ ఎండీ వెంకట్రామిరెడ్డి అరెస్ట్... నాంపల్లి సీబీఐ కోర్టుకు తరలింపు
డెక్కన్ క్రానికల్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి అరెస్టయ్యారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో ఆయనను బెంగళూరు సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రుణాలను సకాలంలో చెల్లించకుండా తనకు రూ.357 కోట్ల మేర నష్టం చేకూర్చారని వెంకట్రామిరెడ్డిపై కెనరా బ్యాంకు బెంగళూరులోని సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ, వెంకట్రామిరెడ్డి బ్యాంకును మోసం చేశారని నిర్ధారించింది. దీంతో బెంగళూరు నుంచి హైదరాబాదు వచ్చిన సీబీఐ అధికారులు కొద్దిసేపటి క్రితం ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తరలించారు.