: తెలంగాణలో డ్రై పోర్టులు ఏర్పాటు చేయండి: నిర్మలా సీతారామన్ ను కోరిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు భేటీ అయ్యారు. సీఎం అధికార నివాసానికి వెళ్లిన ఆమె... కేసీఆర్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో సీ పోర్టులు లేనందున, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆమెను కేసీఆర్ కోరారు. చేనేత పరిశ్రమకు ప్రోత్సాహం అందించాలని, మార్కెటింగ్ వసతి కల్పించాలని విన్నవించారు. నదుల ప్రక్షాళనలో భాగంగా మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయాలని కోరారు. సీఎం కోరికలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.