: మహాదళితుల కోటాలోకి పాశ్వాన్ లు... సీఎం మాంఝీ నిర్ణయం
పాశ్వాన్ కులాన్ని మహాదళిత్ కేటగిరీలోకి చేరుస్తూ బీహార్ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాశ్వాన్ లను మహాదళిత్ కోటాలో చేర్చాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ కులానికి చెందిన వ్యక్తే. గతంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కులాన్ని మహాదళితుల్లో కలపడానికి నిరాకరించారు. ఇటీవలే ఈ విషయానికి సంబంధించి నితీష్ కుమార్ పై రామ్ విలాశ్ పాశ్వాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.