: చంద్రబాబు, కేసీఆర్ ల కొట్లాటంతా నాటకమే: పొన్నం ప్రభాకర్
నాగార్జున సాగర్ జలాల కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెద్ద వివాదమే నడిచింది. రాజకీయ నేతలు, రైతులు ఒక ప్రాంతం వారిపై మరొక ప్రాంతం వారు విమర్శలు కూడా చేసుకున్నారు. సాగర్ వద్ద ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులైతే ఏకంగా కొట్టుకున్నారు. అయితే, ఇంత సీన్ క్రియేట్ కావడానికి కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లే అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్ర సమస్యల గురించి ప్రజలు నిలదీయకుండా ఉండేందుకు, వారి దృష్టిని మరల్చేందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు పోట్లాడుకుంటున్నారని ఆరోపించారు. నిజంగా రెండు రాష్ట్రాల మధ్య సాగునీటి సమస్య నెలకొని ఉంటే, ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటారని ప్రశ్నించారు.