: స్వచ్ఛ భారత్ తో మార్పు తీసుకొద్దాం: కేసీఆర్


లక్షల మందిలో కేవలం కొంత మందికి మాత్రమే ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అదృష్టం లభిస్తుందని... ఆ అవకాశాన్ని ప్రజాసేవ చేసేందుకు వినియోగించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు హైదరాబాదులో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో నగరాలు, పట్టణాలు మెరుగ్గాలేవని... వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా పట్టణాల్లో మార్పు తీసుకురావచ్చని సూచించారు. గంగానది తరహాలో మూసీనదిని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News