: తెలంగాణలో ‘బుగ్గ’ కార్లు పెరిగాయి... టీఆర్ఎస్ షేర్ విలువ పడిపోయిందంటున్న టీ టీడీపీ


తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై టీ టీడీపీ నేతలు ఈ సారి కొత్త రీతిలో విమర్శలు గుప్పించారు. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్, బుగ్గ కార్ల సంఖ్యను మాత్రమే పెంచుతున్నారని టీడీపీ తెలంగాణ అధికార ప్రతినిధి వేం నరేందర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే, తమ బతుకులు బాగుపడతాయన్న ప్రజల కలలను కేసీఆర్ సర్కారు కల్లలు చేసిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని ఆయన ధ్వజమెత్తారు. ఇక ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడంలో ఘోరంగా విఫలమైన టీఆర్ఎస్ షేర్ విలువ క్రమంగా పడిపోతోందని టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

  • Loading...

More Telugu News