: పాక్ తో మ్యాచ్ కు మానసికంగానే కాక శారీరకంగానూ సిద్ధమవుతున్నాం: టీమిండియా కెప్టెన్ ధోనీ


రేపు ఉదయం నుంచి భారత్, పాకిస్థాన్ లలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా టీవీ తెరలకు అతుక్కుపోవడం ఖాయమే. ఎందుకంటే, ఆస్ట్రేలియా నగరం అడిలైడ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ క్రికెట్ల మధ్య భీకర పోరు రేపు ఉదయం 7.30 గంటలకు మొదలు కానుంది. ఈ రెండు జట్ల మధ్య ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆసక్తే. ఇక ప్రపంచ కప్ లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే, మరింత ఆసక్తే. రేపటి మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడాడు. ‘‘పాక్ తో మ్యాచ్ అంటే ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసిందేగా. ఆ ఒత్తిడిని అధిగమించేందుకు యత్నిస్తున్నాం. ఇందులో భాగంగా మానసికంగానే కాక శారీరకంగానూ సమాయత్తమవుతున్నాం’’ అని అతడు కూల్ గా పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News