: చంద్రబాబు, కేసీఆర్... రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు: మైసూరారెడ్డి మండిపాటు


ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కేసీఆర్ ల వ్యవహార శైలిపై వైసీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి విరుచుకుపడ్డారు. చర్చల ద్వారా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సిన తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా నిలుస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్నటి సాగర్ గొడవ, నేటి ఉదయం గవర్నర్ సమక్షంలో ఇద్దరు సీఎంల భేటీ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన మైసూరారెడ్డి, చర్చలను ముందుగానే జరిపితే ‘సాగర్’ గొడవలు జరిగేవి కాదు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాతీర్పుతో గెలిచిన సీఎంలు చర్చల కోసం నామినేటెడ్ గవర్నర్ వద్దకు వెళ్లడం కూడా సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటని మైసూరా అన్నారు.

  • Loading...

More Telugu News