: టీఆర్ఎస్ లో చేరాలని బెదిరిస్తున్నారు, కఠినంగా వ్యవహరించండి... గవర్నర్ ను కోరతామన్న కిషన్ రెడ్డి
టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. గులాబీ పార్టీలో చేరకపోతే నియోజకవర్గ నిధులు రాకుండా ఆపివేస్తామని బెదిరిస్తున్నారని, తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై త్వరలోనే టీఆర్ఎస్ పై ఉద్యమం చేపడతామని అన్నారు. అంతేకాకుండా ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్ లను కలసి పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. మరోవైపు సాగర్ జలాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంయమనం పాటించాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, కఠినంగా వ్యవహరించాలని కోరారు.